టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విలువైన సభా సమయాన్ని వృధా చేస్తూ సభను అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఘనకార్యం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమస్యలపై చర్చించే దమ్ము ధైర్యం లేదన్నారు. ఆ సమస్యపై ప్రశ్న వేసిన టీడీపీ సభ్యులు కూడా దాని గురించి మాట్లాడటం లేదు. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకుండా బయట మీడియా ముందు డ్రామాలు వేస్తున్నారు. సభలో చర్చిస్తే వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయన్నారు.
అలా చర్చ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని వారి భయం. మూడు రాజధానుల విషయంలో సీఎం ఇచ్చిన వివరణ చూసిన తర్వాత ప్రజల్లో చర్చ ప్రారంభం అయింది. రైతు ఆత్మహత్యలకు సంబంధించి పరిహారం ఎగ్గొడితే మేము చెల్లించాం. ఎమ్మెల్యే కానీ వ్యక్తి మాట్లాడే వాటి గురించి నేను మాట్లాడటం అవమానంగా వుంటుందన్నారు. అవగాహన, అనుభవం లేని వ్యక్తి మాటలు పట్టించుకోనవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే…రాజకీయ అనుభవం లేదు. ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన రాజకీయ అనుభవం పవన్ ది. ప్రజలు తమకు సమాధి కట్టడానికి సిద్దంగా ఉన్నారు అనేది చంద్రబాబుకి తెలుసు. ఆ ఫ్రస్టేషన్ లో ఆయన ఏదేదో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాని.
Read Also: Ap Assembly 3rd Day Session Live Updates : మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు
మరోవైపు చీఫ్ విప్ ప్రసాద్ రాజు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. బి.ఏ.సి లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుంది. ఎప్పుడు సస్పెండ్ చేసుకుని వెళ్ళిపొదామా అన్నట్టు టీడీపీ సభ్యులు ప్రవర్తన ఉంది. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్నారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్యం సిద్దంగా ఉందన్నారు. చర్చకు టీడీపీ నాయకులు భయపడుతున్నారు.. సబ్జెక్ట్ లేకుండా సభకు వస్తున్నారు..చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్యే లను సభకు పంపుతున్నట్లు ఉంది. ఈరోజున సభకు వచ్చి ప్రతిపక్షం చర్చలో పాల్గొనాలని కోరుతున్నా అన్నారు ప్రసాద్ రాజు.
Read Also: Adilabad NIA Raids: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో NIA సోదాల కలకలం