రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వాడీవేడీగా సాగిన సమావేశాలు.. మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీలో కాకరేపింది.. ఇక, రెండో రోజు కూడా రసవత్తరమైన చర్చ జరగనుంది.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..
బీఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఆఫర్ ఇచ్చారు.. మీరు ఏ అంశం కావాలన్న చర్చకు మేం రెడీ.. సభలో చర్చకు సహకరిస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు..
ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు.. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతుంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి.. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.. ఇక, చివరిసారిగా జులై 19 నుంచి ఐదురోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.. అయితే, ఈ సారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు రావాలి కోరారు ప్రభుత్వ చీఫ్ విప్…
Daggubati Purandeswari: బీజేపీ పార్టీ పురందేశ్వరికి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి పురందేశ్వరిని తొలగించింది బీజేపీ నాయకత్వం. ఒడిశా రాష్ట్రంలో పదవిని తగ్గించడంతో పాటు ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒడిశా రాష్ట్రంలో ఇంఛార్జుగా ఉన్న పురందేశ్వరిని సహ ఇంఛార్జికి పరిమితం చేసింది. పురందేశ్వరీ వ్యవహార శైలిపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ కారణం వల్లే గత నెలలో ఒడిశా బాధ్యతలు.. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ బాధ్యతల…
అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్… అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధానిగా పేర్కొన్న ఆయన.. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తాం అన్నారు.. వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి… హైదరాబాద్ అభివృద్ధి నేనే శిల్పినని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తే కులీకుతుబ్ షా ఉరేసుకుంటాడని సెటైర్లు వేసిన…
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలుచేశారు ఏపీ మంత్రి జోగి రమేష్… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ 1న తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు. వెన్నుపోటు పొడిచిన రోజును పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి.. ఊరు, వాడ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకునే రోజు.. ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే వైఎస్ పాలన…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన…