జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. హైదరాబాద్లోని పవన్ ఇంటి దగ్గర రెక్కీ, సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ హాట్ టాపిక్ అయిపోయింది.. పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మన నేతను గుర్తుతెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు.. ఏం జరుగుతోందో ఏమో అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, పవన్ విశాఖ పర్యటన తర్వాతే ఇలా…
Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్నది అభియోగం.
యనమల ప్రకటనలో ఏ ఒక్కటీ వాస్తవం ఉండదు అని ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన.. ఏది అనుకూలంగా ఉంటే.. యనమల దానినే తీసుకుంటారు.. గతంలో ఎంతో ధనాన్ని మూటగట్టి.. ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధించ కూడదు.. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు.. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి.. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి అన్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ…
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పని విధానంలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్నాయుడు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడితున్నారని ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో నీవు ఏ పార్టీకి ఓటేస్తావు.. ఏ పార్టీ తరఫున నామినేషన్ వేస్తావు..? అంటూ అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు.. పార్టీలేదు, బొక్కాలేదు అన్న పార్టీకే నామినేషన్ వేస్తావా..? నీకు సిగ్గుందా..! అంటూ ఫైర్ అయిన ఆయన.. 18 నెలలు ముందే నా టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యింది… నీ…
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ... అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.
చంద్రబాబు-పవన్ కలుస్తారు అని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. అదే జరుగుతుందన్న ఆయన.. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారు.. పవన్ కల్యాణ్కి ఏమైనా సమస్యలు ఉంటే ఆయనే ప్రశ్నించవచ్చు అన్నారు మంత్రి బొత్స
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.