ChandraBabu: వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పుడు దీనికి కౌంటర్ కార్యక్రమంగా టీడీపీ ఇదేం కర్మ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని టీడీపీ భావిస్తోంది. తాజాగా ‘ఇదేం కర్మ’ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
Read Also: Pawan kalyan: రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్స్ చేస్తున్న పవన్ కల్యాణ్.. బహుశా అందుకేనేమో
ఈరోజు టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. భవిష్యత్ కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే చంద్రబాబు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే నిమిత్తం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుంటారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.