ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు సందించారు.. భూ సర్వే చారిత్రాత్మ క నిర్ణయమన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారు.. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయం.. భూ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగనన్న నిలిపారని పేర్కొన్నారు.. కానీ, మీ భూములను లాక్కుంటున్నారని, గోల్ మాల్ చేస్తారని ప్రతిపక్షాలు…
ఇప్పటం వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టును ఆశ్రయించిన 14 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ఇప్పటంలో అనవసర రాద్దాంతం చేశారు.. ప్రభుత్వాన్నే కూల్చాలని లోకేష్ విమర్శలు చేశారు.. చివరికి ఏమైంది? కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు.. పిటిషనర్లకు లక్ష చొప్పున పెనాల్టీ వేసింది అని గుర్తుచేశారు.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు…
అవకాశం దొరికితే.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేయానికి సిద్ధంగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా, లోకేష్ తీస్తున్న ఓ సెల్ఫీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పంచ్‌లు వేశారు.. ”ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే…
ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అంటే, ఏడుపు అనేది మగవాని స్వభావానికి విరుద్ధం.. అదే విధంగా నవ్వు అనేది సామాన్య స్త్రీ స్వభావానికి విరుద్ధమట.. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.. అయితే, ఈ సామెతను చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఏడ్చే మగాడిని నమ్మకపోవడం మన సంస్కృతి.. ఆంధ్ర ప్రజలు ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో…
అనంతపురం జిల్లా రాప్తాడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి రాజకీయ వివాదాలే. మాజీ మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మధ్యలో రెండు వర్గాలు శాంతించినా.. పరిటాల సునీత పాదయాత్ర చేస్తాననడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని జాకీ పరిశ్రమ వివాదం కొత్తగా చుట్టుముట్టడంతో రాప్తాడులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జిల్లాలో లేని పరిశ్రమ చుట్టూ సాగుతున్న పాలిటిక్స్ ఏకంగా తాడేపల్లిని తాకడంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకో సైలెంట్ అయ్యారనే అనుమానాలను వ్యక్తం చేశారు.. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు.. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అందుకే బీజేపీని…
రాజకీయాలు చెడిపోయాయి.. లాస్ట్ ఛాన్స్ అంటూ వస్తున్నవారికి మరో ఛాన్స్ ఇవ్వొద్దని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, ఎంజీఆర్, వైఎస్ జగన్ అంటారన్న ఆయన.. పిల్లను ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారంటూ ఎద్దేవా చేశారు.. తమ…
చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నాడు.. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఊడదీసి కొట్టబట్టే కదా రోడ్డున పడ్డావు అంటూ సెటైర్లు వేశారు.. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి మాట్లాడటం ఎప్పుడైనా చూశామా? రాయలసీమ ప్రజల మనోభావాలను మంటగలిపే విధంగా మాట్లాడటం కరెక్టేనా? అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని…
లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇప్పటికే అసలు ఇంకా ఎక్కడి లాస్ట్ చాన్స్ అప్పుడే అయిపోయిందికదా.. ఇక, ఆయన జీవితంలో మళ్లీ సీఎం కాలేడంటూ కామెంట్లు చేస్తున్నారు ఏపీ మంత్రులు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్… చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు.. ఇప్పుడు ప్రత్యేకంగా చివరి ఎన్నికలు ఏంటి? అని ప్రశ్నించారు..…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు అందరూ చూశారన్న ఆయన.. ముఖ్యమంత్రి, పార్టీ నేతల మీద చివరకు ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారని విమర్శించారు.. చంద్రబాబుకు ఎందుకు అంత కోపం వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన..…