రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పని విధానంలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్నాయుడు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడితున్నారని ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో నీవు ఏ పార్టీకి ఓటేస్తావు.. ఏ పార్టీ తరఫున నామినేషన్ వేస్తావు..? అంటూ అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు.. పార్టీలేదు, బొక్కాలేదు అన్న పార్టీకే నామినేషన్ వేస్తావా..? నీకు సిగ్గుందా..! అంటూ ఫైర్ అయిన ఆయన.. 18 నెలలు ముందే నా టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యింది… నీ…
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ... అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.
చంద్రబాబు-పవన్ కలుస్తారు అని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. అదే జరుగుతుందన్న ఆయన.. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారు.. పవన్ కల్యాణ్‌కి ఏమైనా సమస్యలు ఉంటే ఆయనే ప్రశ్నించవచ్చు అన్నారు మంత్రి బొత్స
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు…
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు..…