టీడీపీ ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. రాష్ట్రం దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం.. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇప్పుడు తోక ముడిచారు
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది... చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
చంద్రబాబు రోజూ గంట సేపు ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఉన్నారని.. జగన్ రాయలసీమ ద్రోహి అని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారంలో నుంచి దింపకపోతే రాయలసీమను రత్నాల సీమగా మార్చేవాడట చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.