దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్కిటెక్చ్యురల్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు తమకు నచ్చిన విధంగా ఏదనిపిస్తే అనిపిస్తే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు రాయలసీమ వ్యతిరేకి అని, ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారన్నారు.
కొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. దీంతో టీడీపీ, వాళ్ళ మీడియా బాధ మామూలుగా లేదని, ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పుల పై స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు.
చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సరిపోదన్నారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ల తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ ఉన్నారని, అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు అని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big news, devineni avinash,…