ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకు గానూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా ఉందన్న ధైర్యం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు.
పేద, బడుగు వర్గాల వారి ముఖ్యమంత్రి జగన్ అహ్నరిశలు కృషి చేస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతరీ మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. బాబుగారు జనతా పార్టీకి అధ్యక్షులో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మరిది గారు స్కిప్ట్ చిన్నమ్మ మాట్లాడింది అని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఎక్కడకు వెళ్లిన ఇదే సినిమా స్క్రిప్టు.. తండ్రి పార్టీ మరిది నడుపుతారు.. వీరు వేరే పార్టీని నడుపుతారు.. టీడీపీలో చేరి అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి తీసుకుని మాట్లాడితే బాగుండేది…