వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ఆయన సమావేశం అయినట్టు సమాచారం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు..
‘నాకు వయస్సు ఓ నంబర్ మాత్రమే.. నా ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటుంది’ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారంలో రామకుప్పంలో జరిగిన టీడీపీ బహిరంగ సభ్యలో చంద్రబాబు మాట్లాడారు. ఈ మేరకు ‘నాకు వయసు నంబర్ మాత్రమే.. కానీ నా ఆలోచనలు వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం తప్పనిసరిగా సాధిస్తాం. హంద్రీ నీవాలో నీళ్ళు పారించమంటే, అవినీతి పారిస్తున్నారు. బటన్లు నొక్కి…
మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నాకు చాలెంజ్ చేసారు.. మత్స్యకారులకు, ఉత్తరాంధ్రాకు ఏం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు నీకు దమ్ము, సిగ్గు లజ్జా ఉంటే.. మీ నాన్న కొబ్బరికాయ కొట్టిన పోర్టు, హార్పర్ ఇది అని చూపించు అని చాలెంజ్ చేశారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళనున్న బహిరంగ సభల షెడ్యూల్ ఖరారు అయింది. జనవరి 5వ తేదీ నుంచి 25 పార్లమెంట్ సెగ్మెంట్లల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. రెండు రోజుల్లో మూడు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో జనవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండనుంది. అంతేకాకుండా.. తొలి విడతలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసిందని, హామీల్లో సీఎం జగ్ 85 శాతం ఫెయిల్ అయ్యారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరించటం చరిత్రలో జరగలేదన్నారు.…