అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు నగరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇద్దరు నాయకులు తిరుగుతున్నారు.. రెండు, మూడు రోజుల నుంచి నెల్లూరులో విచిత్రమైన పరిస్థితి ఉంది.. ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని నారాయణ ఒకవైపు తిరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొందరు టీడీపీ నేతలతో కలిసి జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి తిరుగుతున్నారు..
ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా.. స్టేడియాల అభివృద్ధి లేదు.. క్రీడాకారులు ప్రోత్సాహం లేదు.. మంత్రి సీదిరి అప్పల రాజు నోరు అదుపులో పెట్టుకో.. చర్చకు రాకుండా పారిపోయిన నువ్వు.. ఇంకో సారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వం అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. బీహార్ వాడొచ్చాడు వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పది మంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు.
టీడీపీలో వివిధ పార్టీల నుంచి చేరికలు జరుగుతున్నాయి. చంద్రబాబు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు కురబ కులస్థుల ఆరాద్య దైవం కనక దాసు విగ్రహం ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని ఎందుకు ఆలోచించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కురబ కులస్థులను గుర్తించిన పార్టీ వైసీపీ పార్టీనే అని ఆయన తెలిపారు.