ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది... నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది.
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాలు విమర్శలు వస్తున్నాయి.. కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాలలో ఇరుక్కుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.. సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే..…
Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటల్లేవ్... అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై మాటల్లేవ్... యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరిచేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు.. అయినా తీరు మారకుంటే రెండో సారి పిలిచి చెప్తా..., అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు, నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు..