PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- మే 4న అటవిక పాలనకు డెత్ డే
- టీఎంసీ గూండాలను తరిమికొడతాం
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 4న ఆటవిక పాలన అంతం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండో దశలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా డం డం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సభలో మోడీ మాట్లాడారు. ‘‘పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. బెంగాల్ ఎన్నికల మొదటి దశలో జరిగిన పోలింగ్.. గత కొంతకాలంగా గమనిస్తున్న మార్పు కనిపిస్తోంది. నిన్న బీజేపీకి లభించిన మద్దతు.. బీజేపీ విజయానికి సంకేతం..’’ అని అన్నారు.
‘‘రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని మార్చేస్తామని బెంగాల్ మహిళలు చెబుతున్నారు. టీఎంసీ ఒక మహిళా వ్యతిరేక పార్టీ. బీజేపీ మాత్రం మహిళా నేతృత్వ అభివృద్ధి నమూనాపై పనిచేస్తుంది. ఓ కూతురు.. టీఎంసీ అరాచక పాలనకు బలైపోగా.. బీజేపీ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టింది. సందేశ్‌ఖాలి బాధితులకు కూడా నాయకత్వం వహించేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. బెంగాల్ కుమార్తెలు న్యాయం కోరినప్పుడు.. అత్యాచారానికి గురికాకుండా ఉండేందుకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని టీఎంసీ చెబుతుంది. మహిళలు కలలు కనడం టీఎంసీకి ఇష్టం లేదు. బెంగాల్ కుమార్తెల కలలను ఎవరూ తొక్కేయడానికి బీజేపీ అనుమతించదని ఈ రోజు నేను బెంగాల్‌లోని ప్రతి కుమార్తెకు హామీ ఇస్తున్నాను. మహిళల భద్రతే మా ప్రాధాన్యత అని నేను మీకు హామీ ఇస్తున్నాను. మే 4న బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై జరిగిన అన్ని అఘాయిత్యాలపై ఫైళ్లను తెరుస్తాం. ఇది మోడీ హామీ.’’ అని పేర్కొన్నారు.
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
‘‘ఇది విప్లవాల గడ్డ. ఇది వీరుల నేల అని మర్చిపోవద్దు. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి ఏ చోటూ దొరకదు. వారిని రక్షించడానికి ఎవరూ ఉండరు. నిన్న జరిగిన మొదటి దశ పోలింగ్.. టీఎంసీ సాగిస్తున్న ‘అటవిక పాలన’కు మరణఘంటిక మోగించింది.’’ అని అన్నారు.
‘‘బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మధ్యతరగతి ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. 2014కు ముందు ఢిల్లీలోని ప్రభుత్వం టీఎంసీ మద్దతుతో నడుస్తున్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు ఉన్న వార్షిక ఆదాయంపై కూడా పన్ను విధించేది. మేము రూ. 12 లక్షల వరకు ఉన్న వార్షిక ఆదాయంపై పన్నును పూర్తిగా తొలగించాం. దీన్ని ‘సున్నా’ స్థాయికి తీసుకువచ్చాము.’’ అని అన్నారు.
#WATCH | West Bengal: Addressing a public meeting in Dum Dum assembly constituency, PM Modi says, "If a BJP government is formed in Bengal, the welfare of the middle class will be paramount for it. To make the life of the middle class easier, the central government has taken… pic.twitter.com/9XSGQkmEJl
— ANI (@ANI) April 24, 2026
#WATCH | Addressing a public meeting in Dum Dum assembly constituency, PM Modi says, " Last night, TMC was empowering their goons all night long. I say to the people of Bengal, BJP workers, and the public: Do not forget that this is the land of revolution, this is the land of… pic.twitter.com/GRGGTUG9o7
— ANI (@ANI) April 24, 2026
#WATCH | Dum Dum, West Bengal | Addressing an election rally, PM Modi says, "The women of Bengal are saying that they will change the TMC govt in the state. TMC is an anti- women party, while BJP works on the model of women-led development. The mother who made her daughter study… pic.twitter.com/tvg5WqbKgz
— ANI (@ANI) April 24, 2026
#WATCH | Dum Dum, West Bengal | Addressing an election rally, PM Modi says, "I congratulate the people of West Bengal and Tamil Nadu. The polling in the first phase of elections in Bengal has confirmed the wave of change which we have been seeing in Bengal. The support we saw for… pic.twitter.com/VL27YcIFBp
— ANI (@ANI) April 24, 2026
తాజావార్తలు
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!