Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలో డ్రైనేజీలను నిర్మిస్తామని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రోడ్లు వేయిస్తామని, 20 వేల పక్కా ఇళ్లు నిర్మిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ పక్కా ఇళ్ల నిర్మాణం హామీని మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం
అనంతరం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. రైతుల గురించి ప్రభుత్వాలు తగ్గిపోతున్నాయని, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామగ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.