Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Bold N1 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) నుండి Bold N1 5G స్మార్ట్‌ఫోన్‌ను కొత్త 6GB + 128GB వేరియంట్ లో విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన 4GB + 64GB, 4GB + 128GB మోడళ్లకు ఇది కొత్త అదనంగా మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరలో 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. పనితీరు కోసం UNISOC T765 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 6nm టెక్నాలజీతో రూపొందించబడింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 15 క్లిన్ వెర్షన్‌తో వస్తుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా సాఫ్ట్‌వేర్ అనుభవం ఉంటుంది.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!

కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీగా 5000mAh సామర్థ్యం కలిగి ఉండి, 18W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో 10W చార్జర్ ఇవ్వబడుతుంది. స్టోరేజ్ పరంగా 4GB/6GB RAM ఆప్షన్లు, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి. దీనిని మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.
ఈ మొబైల్ కు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ షాంపైన్ గోల్డ్, రాయల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 12,499గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఇది రూ. 11,999కి అమెజాన్ లో మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లతో లావా Bold N1 5G వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్ కానుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!