Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి పాలన చూస్తుంటే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని అన్నారు.
Vangaveeti Asha Kiran: దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగానాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ.. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..?” అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు, ఆ తర్వాత ఆయన పేరును, ఆయన…
YS Jagan: వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వైసీపీ.. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంది.. కనీసం, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహన రంగా పేరుతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వైసీపీ చేయలేదు.. అయితే, నేడు రంగా…
యువతకు, పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ కంటే హనుమంతుడు చాలా బలవంతుడు.. ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు.. కృష్ణుడి మహిమలు, శివుని మహత్యం గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ‘హాలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. మహిళలను అవమానపర్చిన, కించపర్చిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తేవాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో ఇటువంటి వాటిని నిషేధించాలని సూచించారు. ఆడింగోడివా, చేతికి గాజులు వేసుకున్నావా, చీర కట్టుకో వంటి మాటలను ఇళ్ల దగ్గర మాట్లాడటం మానేయండని విజ్ఞప్తి చేశారు. లోకేష్ అన్నయ్య చెప్పాడని చెప్పండని…
రాజమండ్రి అదికవి నన్నయ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను అవమానించారంటూ జన సైనికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ గేట్ బయట కట్టిన తమ ఫ్లెక్సీలు తొలగింపుతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన మహిళా నేత, ఎమ్మెల్యే బత్తుల సతీమణి వెంకట లక్ష్మిని యూనివర్సిటీ నిర్వాహకులు అడ్డుకోవడంతో వివాదం అయ్యింది. బత్తుల బలరామకృష్ణ భార్యను మెడపై చేయి పెట్టి తోసేసారని…
ఆ జిల్లాలో టీడీపీ సీనియర్స్ అయోమయంలో ఉన్నారా? మింగలేక, కక్కలేక సతమతం అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్లో కొంతమంది పక్క చూపులు కూడా చూస్తున్నారన్నది నిజమేనా? అసలేంటి వాళ్ళకొచ్చిన సమస్య? అధికార పార్టీలో ఉండి కూడా మారిపోవాలనే ఆలోచన వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు ఏమున్నాయి? అసలు ఏ జిల్లాలో ఉందా వాతావరణం?. పార్వతీపురం మన్యం జిల్లాలో పసుపు యుద్ధం పీక్స్కు చేరుతోంది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ…
ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు మనం మనం బరంపురం అని పైకి అంటున్నా… లోపల మాత్రం కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? ముందొచ్చిన చెవులకంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ కామ్ అయిపోతున్నారా? ఎవరా లీడర్? సొంత పార్టీలోనికి కొందరు ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పెద్ద పదవులు దక్కించుకోగలిగిన…