మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుందని.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా? అని ప్రభుత్వాన్ని జగన్ప్రశ్నించారు. ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండని.. తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామన్నారు. వైసీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు…
రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వరుస భేటీల అనంతరం శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా-జాతీయ…
ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేలు కొందరు డిఫెన్స్‌లో పడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడుల మాటలు వాళ్ళలో పొలిటికల్ భరోసా కల్పించకపోగా… కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు ఫీలవుతున్నారా? సెల్ఫ్ డిఫెన్స్‌కు కూడా ఛాయిస్ లేకుండా పోతోందా? ఎవరా ఎమ్మెల్యేలు? వాళ్ళ భయం ఏంటి? పవర్, పొజిషన్‌తో మైలేజ్ పాలిటిక్స్ చేద్దామనుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్ధితి అడకత్తెరలోపడినట్టే కనిపిస్తోంది. నేలనపోయే కష్టాలన్నీ వాళ్ళ నెత్తినెక్కి తాండవం చేస్తున్నాయా….…
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ రివర్స్ గేమ్ ఆడిందా? నెగ్గలేమని తెలిసి కూడా.. పావులు కదిపి అధికార పార్టీని గిల్లి గిచ్చి… గబ్బులేపుదామని భావించిందా? ఆ విషయంలో ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయింది? సైకిల్ నాయకులు ఫ్యాన్ ట్రాప్‌లో పడ్డారా? దాని గురించి జిల్లాలో ఏమనుకుంటున్నారు? నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నోటీసులు ఇవ్వడం, గతంలో వైసీపీ నుంచి సైకిలెక్కిన కొందరు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరడం, అధికార పార్టీ అలర్ట్…
కేంద్ర ప్రయోజిత పథకాలు, నిధుల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పెండింగులో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని మంత్రి చెప్పారు.…
Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీకి, మేయర్ స్రవంతికి సంబంధం లేదు.. వైఎస్ జగన్ ను కలిసిన వెంటనే ఇద్దరు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. టీడీపీ విధానాలు నచ్చక తిరిగి వైసీపీ గూటికి వచ్చిన కార్పొరేటర్స్ ను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది
YSRCP : నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈనెల 18న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గతంలో వైఎస్సార్సీపీ తరపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వలస వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు ఇప్పుడు తిరిగి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని ప్రకటించడం విశేషం. మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఈ ఐదుగురు కార్పొరేటర్లు, తమ నిర్ణయాన్ని ఆయన సమక్షంలో…
Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశానికి నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఫైల్ క్లియరెన్స్ లో ఆరు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అని సూచించారు.