Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత.. క్రియశీల గుడివాడ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యక్షమైయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నారు.
CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, హెచ్వోడీలు, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు.
CM Chandrababu: ఇవాళ (డిసెంబర్ 10న) సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశం జరగనుంది. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 45 గంటల వరకూ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించనున్నారు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ యాదవులపై ఎదో మాట్లాడారని కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. అసలు జగన్ ఏం మాట్లాడారు అనేది యాదవ సోదరులతో పాటు అందరూ తెలుసుకోవాలన్నారు. యాదవులకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ద్రోహం చేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందన్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారం నడిపింది…
ఏపీ మినిస్టర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి పర్యటన ఒకసారి కాదు.. ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ సబ్జెక్ట్. ఎలాంటి బలమైన కారణం లేకుండా.. ఆ స్థాయి నాయకుడి పర్యటనను ఏకంగా మూడు సార్లు ఫిక్స్ చేసి వెంటనే ఎందుకు కేన్సిల్ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
బాగా నోరున్న మా పార్టీ నేతల్లో అంబటి రాంబాబు తొలి వరుసలో ఉంటారని చమత్కరిస్తుంటారు వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే బయట కూడా ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినా.. తర్వాత అందరికంటే ముందు సర్కార్ మీద వాయిస్ రెయిజ్ చేశారు అంబటి.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను ఆ మంత్రి పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా? తన పొలిటికల్ జర్నీ టాప్ గేర్‌కు తగ్గకుండా ఉండటం కోసం మధ్యలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారా? నియోజకవర్గంలో ఇక శత్రు శేషం లేకుండా చూసుకోవాలనుకుంటున్నారా? గతంలో జరిగిన అవమానానికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారని అంటున్న ఆ మంత్రి ఎవరు? ఏంటా గతం? Also Read:KGB కథ తెలుసా.. ఈ ఏజెంట్ ఆ దేశానికి అధ్యక్షుడు…
Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి…
Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు…