JC Prabhakar Reddy: అనంతపురం జిల్లాలో మరోసారి టీడీపీ వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల వివాదం కొనసాగుతుంది. రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితీవ్రంగా మండిపడ్డారు. నేను రాయలసీమ బిడ్డనే.. నాకు పౌరుషం ఉందని తెలిపారు. కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు.. మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని చెబుతున్న వైసీపీ నాయకులకు ఇదే నా సవాల్.. దమ్ముంటే ఇప్పుడే రండి చూసుకుందామన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంత షో ఆఫ్ చేస్తున్నాడు.. రాయలసీమకు పౌరుషం లేదంటున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Lydia Lakshmi: పర్మీషన్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తా: ఉక్రెయిన్ మహిళ
ఇక, ఐదేళ్లు ఉప్పుకారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, 16 నెలలుగా ఎక్కడికి పోయారు, ఆయన కొడుకులు ఎక్కడ ఉన్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ అన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నావ్.. పౌరుషం లేదా.. రా రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తానని విమర్శించారు. ధర్మవరంలో నువ్వు ఏం చేశావ్.. గుడ్ మార్నింగ్ అంటూ షో చేశావు అని మండిపడ్డారు. కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదని.. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారు.. పౌరుషం లేని మీరు రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా అని అడిగారు. చీము, రక్తం ఉంటే.. దమ్ముంటే తాడపత్రికి రండి అని సవాల్ విసిరారు.
Read Also: Ankush Bharadwaj: మైనర్ షూటర్‌పై లైంగిక దాడి.. కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై పోక్సో కేసు!
అయితే, మళ్లీ జైలుకి వెళ్లేందుకు నేను రెడీ.. గతంలో కూడా మేము జైలుకు వెళ్లి వచ్చాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నీళ్ల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తే రైతులు కొడతారని చెప్పాడు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కార్లు, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించాడు. చంద్రబాబు మంచోడు కాబట్టి.. మేము ఏం మాట్లాడకుండా ఉన్నాం.. మీరు రప్పా రప్పా అంటున్న.. చంద్రబాబు అభివృద్ధి కోసం తిరుగుతున్నారు.. ఇంకోసారి రాయలసీమ పేరుత్తితే ప్రజలు కొడతారని సూచించారు. రాయలసీమ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రండి, చంద్రబాబు ఏం చేశాడో.. జగన్ ఏం చేశాడో తేలుద్దామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Read Also: India GDP 2025-26: దేశ జీడీపీ వృద్ధిపై స్పందించిన ప్రధాని మోడీ.. భారత్ లక్ష్యంపై ఆసక్తికర ట్వీట్..
కాగా, సీఎం చంద్రబాబు దయా దక్ష్యాణ్యాల మీద మీరంతా బతుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రోజా వచ్చి మూడేళ్ల తర్వాత చూస్తా అంటుంది.. ఏం చూస్తుంది అని అడిగారు. మూడేళ్ల తర్వాత కాదు ఇప్పుడే చూసుకుందాం రండి.. రాయలసీమ ప్రజలు కేతిరెడ్డి కుటుంబాన్ని తంతారు.. నీ స్టైల్ కూతలు మానుకో.. ధర్మవరం కేతిరెడ్డికి సలహా ఇస్తున్నాను.. మీకు రాయలసీమ పౌరుషం ఉంటే రెడీగా ఉండండి.. కారు కూతలు కూయొద్దు అని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.