Off The Record: మంత్రి పదవి కోసం కోటంరెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టారా?
- మంత్రి పదవి కోసం కోటంరెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టారా?..
- ఇటీవల ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ చుట్టూ సరికొత్త చర్చలు..
- వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు గిరిధర్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రకటన..
- ఎమ్మెల్యే నాటకీయ పరిణామాలు సృష్టిస్తున్నారా అన్న డౌట్స్..
- కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మాటల టైంలో ఎమోషనల్ డ్రామా?..
- చంద్రబాబు తనను మోసం చేశారని ఆఫ్ ద రికార్డ్‌లో చెబుతున్నారా?..
- ఎత్తుగడలు తెలుసుకాబట్టే అట్నుంచి రియాక్షన్ లేదా?..
- జీవితాశయం నెరవేరకుండానే కోటంరెడ్డి రిటైర్ అవుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ప్రతికూల పరిస్థితుల్లో కూడా… తన మెలో డ్రామాతో సానుభూతి సంపాదించుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన.. గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంప్ కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కోటంరెడ్డికి హామీ ఇచ్చారట. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని, జీవితాశయం నెరవేరబోతోందని అనుచరులకు తెగ చెప్పేసుకున్నారట. తీరా చూస్తే…. ఇప్పుడా వాతావరణమే కనిపించకపోతుండటంతో…. కొత్త డ్రామా మొదలుపెట్టినట్టు గుసగుసలాడుకుంటున్నాయి సింహపురి రాజకీయవర్గాలు.ఇటీవల పొట్టిపాలెం కలుజుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా… ఎమ్మెల్యే అన్న మాటల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు శ్రీధర్‌రెడ్డి. పార్టీ నేతలు సహకరించాలని కూడా కోరేశారు.
దీంతో సడన్‌గా కోటంరెడ్డి నోటి నుంచి ఈ రిటైర్మెంట్ మాట ఎందుకు వచ్చిందని కూపీ లాగితే కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎప్పటికప్పుడు నాటకీయ పరిణామాలు సృష్టించడంలో దిట్ట అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి… మరోసారి తన కౌశలాన్ని ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చర్చలు జోరుగా నడుస్తున్నందున ఇప్పుడు మొదలుపెడితేగానీ… అప్పటికి వర్కౌట్ అవదన్న ఉద్దేశ్యంతో.. తమ్ముడి పొలిటికల్ కెరీర్, నా రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్ డ్రామా పండించే ప్రయత్నం చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మైక్ ముందు సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నా… వెనక మాత్రం… తనను చంద్రబాబు మోసం చేశారంటూ అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు చెప్పేస్తున్నారట. అందుకే… ఇలా మరోసారి పోటీ చేయబోనని ప్రకటిస్తే… అది పార్టీ పెద్దలకు చేరి రేపు పునర్ వ్యవస్థీకరణలో తనకు ఛాన్స్ దక్కుతుందన్నది ఆయన లెక్కగా అంచనా వేస్తున్నారు కొందరు. ఈ ఎత్తుగడల గురించి చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఉన్నందునే…. ఈయన ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా… అట్నుంచి మాత్రం నో రియాక్షన్ అన్న మాటలు వినిపిస్తున్నాయి.
Also Read
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
ఈ పరిస్థితుల్లో… కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన జీవితాశయం నెరవేరకుండానే పొలిటికల్ రిటైర్మెంట్ తీసేసుకుంటారా? లేక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైం ఉంది కాబట్టి…. అప్పటికి మనసు మార్చుకుంటారా అని మాట్లాడుకుంటున్నాయి నెల్లూరు రాజకీయవర్గాలు. నెల్లూరు రూరల్‌లో వైసీపీ బలహీనంగా ఉందని, ఈసారి తన తమ్ముడిని నిలబెట్టి మరోసారి గెలిపిస్తానని టీడీపీ పెద్దలకు ఇప్పటికే చెప్పారట కోటంరెడ్డి. మొత్తం మీద అమాత్యా అనిపించుకోవాలన్న కోటంరెడ్డి కోరిక చుట్టూ… కొత్త చర్చలు మాత్రం మొదలైపోయాయి.
తాజావార్తలు
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?