రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద జల్లోద్దని.. రాజకీయ ఆరోపణలు మానుకోవాలని దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. ఆలయం నుంచి వెండి తీసుకువెళ్లి బెంగళూరులో విక్రయించి..
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడుకి.. అతడి తమ్ముడు సన్యాసి పాత్రుడుకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి అయ్యన్న పాత్రుడుకి అతడి తమ్ముడు ఛాలెంజ్ విసిరాడు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఆ సీటు మార్పుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు.. మొదట భారతీయ జనతా పార్టీలో చేరి.. పోటీ చేయాల్సిందిగా నల్లమిల్లిని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో.. రామకృష్ణారెడ్డి.. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్…
ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉదయమే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు.
ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.