ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని.. చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని.. పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 75 దాటింది, ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని.. ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాతాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్లు విడుదల చేశారు.
రేపటి నుంచి టైటాలింగ్ చట్టం అమల్లోకి వస్తుందనీ, ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ చాలా దారుణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు గోరంట్ల బుచ్చియ్యచౌదరి
సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల ఆస్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
ఏలూరు జిల్లా కైకలూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో లోడిద లంక, పలాటపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జగన్ ను తొలగించు కోవాలనే విషయంపై ఎప్పటి నుంచో చంద్రబాబు కుట్ర పన్నారని నెల్లూర లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన గాజు గ్లాస్ సింబల్ వివాదం క్రమంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నేటితో ముగిసింది. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది.
నంద్యాల జిల్లా డోన్లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన...అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు.