తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు.
ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వంగవీటి రాధా అని.. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. దెందులూరులో చింతమనేని అభిమానులు ఎక్కువ ఈలలు వేస్తారు తక్కువ పని చేస్తారు.. ఇకనుంచి ఎక్కువ పని చేయాలన్నారు.