Glass Symbol: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది.. దీనికి ప్రధాన కారణం.. ప్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు ఉండడమే.. అంతేకాదు.. రాష్ట్రంలోని 50కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్.. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది జనసేన పార్టీ.. ఇప్పుడు గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలుగుదేశం పార్టీ.. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించ వద్దని కోరుతూ.. అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ.. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా.. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. దీనిపై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.
Read Also: T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?
కాగా, గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశే ఎదురైన విషయం విదితమే.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన.. ఆ పిటిషన్ పై వాదనలు వింది హైకోర్టు.. ఆ తర్వాత హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. బుధవారం రోజు హైకోర్టు ముందు కీలక విషయాలు వెల్లడించింది.. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ.. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్.. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్.. అయితే, తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు వేరేవారికి కేటాయించ వద్దని హైకోర్టును కోరింది జనసేన.. కానీ, గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్లా ఇవ్వటం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది.. జనసేన పిటిషన్ డిస్పోజ్ చేసింది.. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది ఏపీ హైకోర్టు. దీంతో, జనసేన పార్టీకి హైకోర్టులో షాక్ తగిలినట్టు అయ్యింది.. అయితే, ఇప్పుడు హైకోర్టులో టీడీపీ అత్యవసర పిటిషన్ దాఖలు చేయడంతో.. విచారణ ఎలా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.