Purandeswari: కూటమి విజయం చిన్నది కాదు.. ఇది ఒక హెచ్చరిక..!
- కూటమి విజయం అనేది చిన్న విజయం కాదు.. చాలా పెద్ద విజయం.. ఈ విజయం ఒక హెచ్చరిక లాంటిది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం
- గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతి పాలన తీరుతో ప్రజలు ఒక గుణపాఠం తెలియచేశారన్న పురంధేశ్వరి
- ప్రజా సంక్షేమన్ని పట్టించకపోతే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: కూటమి విజయం అనేది చిన్న విజయం కాదు.. చాలా పెద్ద విజయం.. ఈ విజయం ఒక హెచ్చరిక లాంటిది అని మనం భావించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతి పాలన తీరుతో ప్రజలు ఒక గుణపాఠం తెలియచేశారు.. అధికారం వచ్చాక ప్రజా సంక్షేమన్ని పట్టించకపోతే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియచేశారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన చేయకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహారిస్తే మాత్రం ప్రజలు సహించరని.. నిశ్శబ్ద ఓటుతో జవాబు ఇచ్చారని పేర్కొన్నారు..
Read Also: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. ఫస్ట్ ప్లేసులో ఎవరంటే..?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కూటమితో పార్టీలు కలుస్తాయని తెలిసినప్పుడు కొందరు ఆశావాహులు సైతం నిర్ణయాన్ని గౌరవించి కూటమి కోసం సమన్వయంతో పని చేశారని గుర్తుచేశారు పురంధేశ్వరి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తిరిగి తీసుకురావడం కూటమి ప్రభుత్వం మీద ఉన్న బాధ్యతగా పేర్కొన్న ఆమె.. గత ప్రభుత్వం రాజధాని, పోలవరం నిర్మాణాలని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి వీధి దీపాలతో శోభయానుమానంగా మారింది.. పార్టీ విధి విధానాలను ప్రతి కార్యకర్త ఒక బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి నినాదంతో రాష్ట్రం అభివృద్ధి దిశలో ఉంటుంది అన్నారు. ఎన్డీఏ కూటమికి అనూహ్యమైన విజయానికి ప్రతి కార్యకర్త కస్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక, పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిధిగా బీజేపీ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ హాజరయ్యారు.. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వరరావు, విష్ణు కుమార్ రాజు, పార్ధసారధి తదితర నేతలు.. మరోవైపు.. ఈ సమావేశంలో బీజేపీ తరపున గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను సత్కరించారు బీజేపీ ఏపీ పదాధికారులు, జిల్లాల ఇంఛార్జ్‌లు..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?