Lok Sabha Speaker Election: స్పీకర్ ఎన్నిక.. ఎంపీలకు విప్ జారీ చేసిన టీడీపీ
- లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు విప్ జారీ చేసిన టీడీపీ..
- 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్ విప్ జారీ..
- రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌లో పేర్కొన్న పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి..
- రేపు ఉదయం 11 గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని.. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు విప్ జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. తమ పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్ విప్ జారీ చేసింది టీడీపీ.. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌లో పేర్కొన్నారు పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి.. రేపు ఉదయం 11 గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని, ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్నారు హరీష్ బాలయోగి.. రేపు ఉదయం 9.30 గంటలకు టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు టీడీపీపీ నేత శ్రీకృష్ణ దేవరాయలు.. ఈ సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్ కు వెళ్లనున్నారు టీడీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీకి చెందిన బీజేపీ, జనసేన సభ్యులను కూడా సమావేశానికి ఆహ్వానించింది టీటీడీపీ..
Read Also: David Warner : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ భాయ్..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కాగా, స్పీకర్ ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లు ఎన్డీఏ కూటమికి కీలకంగా మారాయి.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది. అయితే, స్పీకర్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!