గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు కదా.. రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీలో ఐదు సంవత్సరాలు పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..
విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉందిగానీ... అందు కోసం ఆయన చేస్తున్న స్టంట్స్ పరువు తీసేస్తున్నాయన్న టాక్ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్నచిన్న విషయాలను సాతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలు.. ఆయన కామెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’గా పేర్కొన్న ఆయన.. రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అంట గట్టాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఈ రోజు విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, ఆ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. కానీ, టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ తేలనట్టుగా తెలుస్తోంది.
హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు..
Adivasi Divas: ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిపేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు.. విజయవాడలో జరిగే ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు ఏపీ సీఎం..