Muppavarapu Venkaiah Naidu: రాజకీయ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. బాపట్ల జిల్లా కారంచేడులో జాగర్లముడి కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరుయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, తెన్నేటి కృష్ణ ప్రసాద్.. తదితరులు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు.. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.. అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరు అన్నారు..
Read Also: Wayanad Helping : కేరళ సీఎంను కలిసిన సీనియర్ హీరోయిన్స్.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
మరోవైపు.. ప్రతి ఒక ఎమ్మెల్యే, ఎంపీ చట్టసభల్లో హుందాగా నడుచుకోవాల్సింది పోయి గుండీలు చింపుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. బయటకు రా.. నీ సంగతి తేలుస్తా.. అంటూ వాళ్ల వ్యక్తిత్వం చూపుతున్నారు.. కానీ, ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వారు హుందాగా ఉండాలి.. మాటలు సక్రమంగా రావాలి.. కష్టపడి ఇష్టంగా పనిచేసే వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారు.. అలాంటి వారిని ప్రజలు ప్రతిపక్షాల్లో కూర్చోబెడుతున్నారు అంటూ హాట్ కామెంట్లు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.