Minister Anagani Satya Prasad: తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గోట్టిపాటి రవితో కలిసి దర్శించుకున్న మంత్రి అనగాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని పేర్కొన్నారు.. అయితే, తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదన్న ఆయన.. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగంగా జరుగుతోందన్నారు.. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయి.. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు..
Read Also: Pregnant Cars: ఇదేందయ్యా ఇది.. కార్లేంటి ఇలా అయిపోయాయి..
ఇక, పెద్దిరెడ్డి బాధితులు వేలసంఖ్యలో ఉన్నారని తెలిపారు మంత్రి సత్యప్రసాద్.. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయన్న ఆయన.. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలిపారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతాం.. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.. ఇక, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెవిన్యూ సదస్సులు పెట్టామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..