CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు ఏపీ సీఎం..
విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు.
మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.