మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Gottipati Ravi Kumar: ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాపై కావాలని నిందలు వేశారని ప్రజలకు అర్థమైంది..
Devineni Uma: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ ప్రజా సమస్యలను తీర్చేందుకు తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఆగస్టు 1నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీపై తప్పుడు కూతలు మానుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు.
Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు.
MLC Elections 2024: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.