సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ (ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) ఛైర్మన్ రవినాయుడు..పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆరోపించారు.. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు.. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు..
అరండల్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది.
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అనే అంశంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. వాస్తవాలు చెబితే మాకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు ఖర్చుపెడితే ఎలా ఒప్పుకుంటాం అని నిలదీశారు మంత్రి పయ్యావుల కేశవ్.. నిధులను పక్కదారి పట్టించడం రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్నారు..
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు..
వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా రూ.100 కోట్ల పనుల్లో 30 శాతం పనులు పూర్తి చేశామని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరుకు చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. బడ్జెట్లో 6 లక్షల 46 వేల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కూటమి ప్రభుత్వం.. టీడీపీ 2019 నాటికి 4 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పాలకొల్లు మండలంలోని 8 గ్రామాల సర్పంచులు వైసీపీకి గుడ్ బై చెప్పి.. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. రాష్ట్ర జల వనరుల శాఖ…