తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు..
కాసేపటి క్రితం ముగిసిన పీఏసీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరిగింది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ నిర్వహించారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి,
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ ఎమ్మెల్యేగా వరసగా నాలుగు సార్లు గెలుపొందిన సీనియర్ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదా దక్కనుంది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల నియమితులు కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్ గా నియమితులు కానున్నారు.. ఈ మేరకు వేగుళ్లకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ (ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) ఛైర్మన్ రవినాయుడు..పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆరోపించారు.. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు.. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు..
అరండల్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది.
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అనే అంశంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. వాస్తవాలు చెబితే మాకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు ఖర్చుపెడితే ఎలా ఒప్పుకుంటాం అని నిలదీశారు మంత్రి పయ్యావుల కేశవ్.. నిధులను పక్కదారి పట్టించడం రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్నారు..
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.