Minister Vasamsetti Subhash: తనపై ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు.. అవినీతి కేసులో త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్టు అవుతారు.. వారి అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు.. నేను భూకబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారు.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు అని సూచించారు.. అయితే, వైసీపీ నేత పిల్లి సూర్య ప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారు.. పిల్లి సూర్య ప్రకాష్ నాపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసు ఇచ్చా.. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతాను అని హెచ్చరించారు.. ఉనికి కోసం అభియోగాలు మోపుతున్నారు అంటూ ధ్వజమెత్తారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.
Read Also: Aamir Khan : సినిమాలకు స్టార్ హీరో అమీర్ ఖాన్ స్వస్తి.. కానీ..?
ఇక, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని.. పోలవరాన్ని 2027 నాటికల్లా పూర్తిచేయాలని దృడ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపిన విషయం విదితమే.. రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో గడచిన అయిదేళ్లు బ్రతికామన్నారు. కూటమి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని, ఆయన పూర్తిగా ఆర్థికాభివృద్ధిపైనే దృష్టిసారించారని వెల్లడించిన విషయం తెలిసిందే.. స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించే విధంగా నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాల ద్వారానే కాకుండా తెలివైన వారి ద్వారా చిన్నతరహా పరిశ్రమలు పెట్టించాలని ఆయన ఆకాంక్షస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 84 వేల కోట్లు రూపాయల పెట్టుబడులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేసిన విషయం విదితమే..