ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (నవంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ హాజరుకావటం లేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే…
కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఆయన ఫోటోలు దిగారు. మంగళగిరి-విజయవాడ…
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ నేటి యువతకు రోల్ మోడల్‌గా నిలిచారు రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత జఠిలమైనదైనా తన దృష్టికి వచ్చిన వెనువెంటనే స్పందించడం, పరిష్కారమయ్యే వరకు వెంటపడడటం.. ప్రజాసేవలో మంత్రి లోకేష్ నిబద్ధత, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. చాలీచాలని ఆదాయాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేందుకు ఎడారి దేశాలకు వెళ్లి…
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
59 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ.. రెండో జాబితా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. 59 మందితో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి 9 మందికి.. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కగా.. మిగతా పోస్టులు తెలుగుదేశం పార్టీకి చెందినవారికి దక్కాయి..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.
డైలీ సీరియల్లో సస్పెన్స్ సీన్ లను తలపించేలా అక్కడి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి కోర్టులో ఉన్న బాల్.. టిడిపి వైపు వెళ్ళింది. ఆ తర్వాత అదే బాల్ మళ్ళీ వైసిపి కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తు వేస్తూ…టిడిపి వేసిన వ్యూహంలో వైసిపి చిక్కుకుందా…? పొలిటికల్ టూర్లను తలపించే విధంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయా ? ఎన్నికలు లేని సమయంలో క్యాంప్ రాజకీయాలు ఏంటి ? ఎన్నికలు లేవు. ఓటింగ్ అసలే లేదు. అయినా…
కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని విజయం కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే విషయం తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్..
తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు.. ఆయన వయస్సు 99 ఏళ్లు.. ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు రెడ్డి సత్యనారాయణ..