YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!
- అదానీ కేసుల వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్..
- అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదు..
- సీఎంలను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు..
- ఐదేళ్ల కాలంలో అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన జగన్..
- అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్..
- తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారంపై స్పందించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివరణ ఇచ్చారు.. తాము ప్రభుత్వానికి ఆదాయం పెంచామని.. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఆదాయాన్ని ఆవిరిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. ఇక, ఇదే సమయంలో.. అదానీ కేసుల వ్యవహారంపై స్పందించారు.. అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదన్నారు వైఎస్ జగన్..
Read Also: YS Jagan: ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది.. నేను మంచోడినా..? చంద్రబాబు మంచోడా..?
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు.. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు వైఎస్ జగన్.. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన ఆయన.. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని వెల్లడించారు.. అయితే, తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వ, సేకి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి.. మూడో వ్యక్తి లేరని స్పష్టం చేశారు.. అయితే, తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: Health Tips: వాయు కాలుష్యంతో పోరాడే 4 రకాల టీలు.. వీటితో శ్వాసకోశ సమస్యలకు చెక్
ఇక, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్నించారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. దానిని పక్కన పెడితే మీరు నన్ను ఏమనేవారు? అని ప్రశ్నించిన జగన్.. సీఎం చంద్రబాబు తెలిసి తెలిసి చేస్తున్నది ధర్మేనా? అని నిలదీశారు.. ఇంత చవకైన ధరకు ఇంతకు ముందు ఎన్నడూ విద్యుత్ కొనుగోలు జరగలేదన్నారు వైఎస్ జగన్.. చంద్రబాబు హయాంలో 20214-19 మధ్య 133 పీపీఏలు చేశారు.. విండ్ పీపీఏలు యూనిట్‌కు రూ.4.80 చేసుకున్నారు.. ఇక, సోలార్ విద్యుత్ అయితే యూనిట్‌కు రూ.6.99 వరకు ఒప్పందాలు చేసుకున్నారని.. విండ్ పవన్ యావరేజ్ రూ.4.63కు యూనిట్ కొనుగోలు చేశారు.. సోలార్ పవర్ యావరేజ్ రూ.5.90కు యూనిట్ కొనుగోలు చేశారని చెప్పుకొచ్చిన జగన్.. కేంద్రం అంత మంచి ఆఫర్ ఇస్తే స్పందించిన నేను మంచోడినా..? అంత దిక్కుమాలని ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు మంచోడా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు సోలార్ ఒప్పందాల వల్ల ఏడాదికి రూ.2 వేల కోట్ల అదనపు భారం.. 25 ఏళ్లకు అంటే రూ.50వేల కోట్లు అదనపు భారం అవుతుందనిన్నారు.. మేం లక్ష కోట్లు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తే.. చంద్రబాబు 80 వేల కోట్లు ఆవిరి చేసే ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!