Alapati Rajendra Prasad: గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు.
Vijayasai Reddy: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌కు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు పక్కున నవ్వేస్తున్నారన్న ఆయన.. తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని.. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధ:పాతాళానికి తొక్కేశారు.. కానీ, ఇంకా మారని జగన్‌ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో…
CM Chandrababu: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో 21 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూచించారు.
YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారు.. ఇప్పుడు ఆ బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువు అయిందని ఎద్దేవా చేశారు.
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 6) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో పైకి కనిపించనిది ఏదేదో జరిగిపోతోందా? గ్రూప్‌వార్ లిటరల్‌గా తెలుగుదేశం పార్టీ పరువును రోడ్డుకీడుస్తోందా? అంటే.. ఎస్....పరిణామ క్రమం అలాగే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సీనియర్ దళిత నేతగా పేరున్న కోనేటి ఆదిమూలంను ఏరికోరి పార్టీలోకి రప్పించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం.