టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవలం 11 స్థానాలు గెలిచిన కూటమి ఎలా స్థాయి సంగం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నలుగురికి పచ్చ కండువాలు వేసేశారని.. టీడీపీ పెట్టిన క్యాంప్‌లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. మేము కోడి పిల్లలను…
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందంటూ కితాబు ఇచ్చారు.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. నిర్మలమ్మ బడ్జె్ట్ సంతృప్తి నివ్వలేదన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన పై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు..
తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పాత తరం నేతలను పక్కన పెట్టేసి.. యువతరానాకి పెద్దపీట వేయనున్నారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది.. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది పొలిట్‌బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్ర నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.