భారత్‌లో బీజేపీ దూసుకుపోతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి 21 రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి అమరావతికి వెళ్లనున్నారు. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైళ్ల క్లియరెన్స్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అగ్రస్థానంలో ఉండగా.. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా…
విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. కేవలం పనులు వేగవంతం కోసమే ర్యాంకులన్న సీఎం చంద్రబాబు.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదు.. పైస్థాయి నుంచి చిరుద్యోగి వరకు పనిపై దృష్టి పెడితేనే ఫలితాలు: సీఎం చంద్రబాబు
Mopidevi Venkataramana: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, ఎన్నెన్నో ఒడి దుడుగులు ఎదుర్కొన్నాను అని తెలిపారు.
Minister Sandhya Rani: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడింది. పిచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ గా మారటమే జగన్ 2.0 అని పేర్కొంది. శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్.. విజయమ్మ, షర్మిలా ఆయుష్షు గట్టిది కాబట్టే అతడికి దూరంగా ఉంటున్నారు.
Alapati Rajendra Prasad: గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు.
Vijayasai Reddy: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌కు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు పక్కున నవ్వేస్తున్నారన్న ఆయన.. తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని.. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధ:పాతాళానికి తొక్కేశారు.. కానీ, ఇంకా మారని జగన్‌ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో…