ఏపీలో టీడీపీ కుదేలైపోయిందని, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవడం గ్యారంటీ అన్నారు ఏపీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. అచ్చెన్నాయుడు ఏ గాలి పార్టీలో ఉన్నాడు.. మాది గాలి పార్టీనో.. మంచి పార్టీనో.. మా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నామో..అచ్చెన్నాయుడుకి ఆయన గురువుకి బాగా తెలుసు. టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా కుదేలైపోయింది.. వాళ్ళేదైనా మాట్లాడుతారు.. రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తు కోసం స్ట్రెయిట్ లైన్ లో వెళ్తున్నాం. మా నాయకుడు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి…
పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్…
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా పదవులు అనుభవించిన నాయకులు ఉంటే.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ.. అక్కడ సీన్ రివర్స్. లాభం చేయాల్సిన వాళ్లే నష్టం చేస్తున్నారట. ఆ ఇద్దరూ ఉమ్మడిగా పార్టీని కిల్ చేస్తున్నారనే విమర్శలు ఊపందుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ? ఎవరా నాయకులు..? పార్టీ పవర్‌కు దూరం కావడంతో నేతలు సైలెంట్ మోడ్..! టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆ పార్టీ నాయకులు ఆడింది ఆట.. పాడింది పాట..! పార్టీ…
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ…
పుత్సవాత్సల్యం ఎంత పనినైనా చేయిస్తుంది. ఆ ప్రేమలో ఉన్నవారు ఆఖరికి చావడానికైనా.. చంపడానికి సిద్ధమవుతుంటారు. ఇప్పుడు ఏపీ టీడీపీలోనూ అదే సీన్ కన్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన పుత్రుడు లోకేష్ ను ఎలాగైనా రాజకీయంగా యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది. ఆయనకు వయోభారం మీద పడుతుండడంతో ఇప్పుడు లోకేష్ ఎదగడం చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. ఈ కారణంగానే ప్రస్తుతం టీడీపీని…
సీమలో తిరిగి పట్టుసాధించే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోందా? రాయలసీమ హక్కుల సాధన ఉద్యమాన్ని తలకెత్తుకుందా? కర్నూలు కేంద్రంగా కృష్ణా జలాలపై తెలుగుదేశం తలపెట్టిన ఆందోళన దేనికి సంకేతం? లెట్స్ వాచ్! రాయలసీమ హక్కుల సాధన పేరుతో టీడీపీ పోరు! సాగునీటి ప్రాజెక్టులు.. కృష్ణా, తుంగభద్ర జలాల అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ.. రాయలసీమ హక్కుల సాధనకు ఉద్యమాన్ని ప్రారంభించింది టీడీపీ. సీమ వెనకబాటుతనం.. నిర్మాణంతోపాటు ప్రతిపాదనల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. నీటి…
మనుగడ కష్టమైనచోట దుకాణం మూసేయడం కామన్. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఇదే చేశాయి. కానీ.. ఆయన ఆలోచన వేరేలా ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గినా పార్టీని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో లేక.. ఒక మనిషి ఆఫీస్‌లో ఉంటే చాలని భావించారో ఏమో తాళం తీసి.. తాళం వేసే వారికి బాధ్యతలు అప్పగించారని టాక్ నడుస్తోంది. ఆ పార్టీ ఏంటో? ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం. బక్కని ఎంపికపై టీడీపీలో చర్చ లేదు.. ఆశ్చర్యం లేదు! తెలంగాణలో…
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. తర్వాత పోటీ చేసి ఓడిపోయింది మాత్రం మూడుసార్లు. టీడీపీ ఆయన్నే నమ్ముకుందో ఏమో.. ఓడినా ఇంఛార్జ్‌గా కొనసాగిస్తోంది. విచిత్రం ఏంటంటే.. సొంత పార్టీ కేడర్ ఆయన్ని ఓన్ చేసుకోదు. కేడర్ వర్సస్ లీడర్ అన్నట్టుగా అక్కడ పార్టీ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? రోడ్డున పడుతున్న నూజివీడు టీడీపీ రాజకీయాలు కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌కు, కేడర్‌కు మధ్య…