60 ఏళ్లు కుటుంబ పాలనలో నలిగిపోయి అభివృద్ధికి ఆమడ దూరం జరిగిపోయింది పలాస నియోజకవర్గం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. పలాసలో గతంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల GSTతో పాటు గౌతు సర్వీస్ ట్యాక్స్ ఉండేది ఇక్కడ. వాటన్నింటినీ చూసే గౌతు కుటుంబాన్ని నియోజకవర్గం తన్ని తరిమేసింది. అసలు శిరీష అడ్రస్ ఎక్కడ. శిరీషకు ఐదు అడ్రస్ లతో వోటర్ ఐడీ కార్డ్స్ ఉన్నాయి. మీకెవరికైనా దమ్ముంటే మావారు ఆక్రమణలకు పాల్పడినట్లైతే వివరాలు ఇవ్వండి. ఊరికే పనికిమాలిన మాట్లాడితే నేను కుర్రవాడిని అది గుర్తు చేస్తున్నా
మీరే కదా ఆక్రమణలపై చర్చలెందుకు చర్యలు తీసుకోండని తొడగొట్టారు ఇప్పుడెందుకు ఈ ఏడుపులు, ఓవరాక్షన్. ఏదో నువ్వు దేశసేవ కోసం వస్తున్నట్టు నిన్ను ఆపేసినట్టు ఓ స్వాతంత్య్ర పోరాటం కోసం వస్తుంటే జైల్లో పెట్టేసినట్టు లోకేష్ బిల్డప్ ఇచ్చాడు. అసలునీ భాషకి నీ బాడికి ఏమైనా సంబంధం ఉందా? మిస్టర్ లొకేషన్ సూటిగా అడుగుతున్న నీకు, మీ నాన్నగారికి ఆక్రమణల గురించి మాట్లాడే అర్హత ఉందా ?మీరు చెప్పుకుని తిరుగుతున్న టిడిపి అక్రమంగా లాక్కున్నదన్నారు మంత్రి అప్పలరాజు.
Read Also: RRR Star Jr NTR Meet Amitshah Live: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ
దమ్ముంటే మీ నాన్న అక్రమంగా ముఖ్యమంత్రి కాలేదని చెప్పు. నువ్వు మంత్రి కావడం కూడా ఓ అక్రమం . అసలు మంత్రి అవ్వడానికి నీకున్న అర్హత ఏంటి?చంద్రబాబు కొడుగ్గా పుట్టడమే నీ అర్హతా? లేదా నీ బాబు జాగీరా ఆంధ్రప్రదేశ్ అంటే? అడుగు మీ నాన్నగారిని నీది ఏ ఊరు?ఏ నియోజకవర్గమో అడుగు? నీకు టిక్కెట్ కన్ఫమ్ చేశారో లేదో మీ నాన్నని అడుగు. మంగళగిరిలో కూడా నీ కథ అయిపోయింది. నా స్నేహితుడు చిరంజీవి పార్టీలోకి వచ్చారు కదా..ఎలా వుంది దెబ్బ… దెబ్బ అదుర్స్ కదా…కుప్పం లో ఈసారి భరత్ అనే మత్స్యకారుడు పోటీ చేస్తున్నాడు. మత్స్యకారులు చేతిలో మీ నాన్న మట్టికరవపోతున్నారని మత్స్యకార ప్రతినిధిగా అప్పల్రాజు చెప్పారని మీ నాన్నతో చెప్పు అన్నారు.
తోలు తీస్తా, ఫినిష్ చేస్తా అంటే… మత్స్యకారులం మర్చిపోయామా?శ్రీకాకుళం వచ్చి పలాస వచ్చి.. పలాసలో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతావా నువ్వు… మరోసారి ట్రై చెయ్ మళ్లీ . పలాస ఉద్యమాల గడ్డ గుర్తుపెట్టుకో… తమాషాలా
మీ అందరికీ ఆక్రమణలు అలవాటు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమం గతంలో వాడిన ప్రజావేదిక అక్రమం.అవి నదీగర్భంలో కట్టారు. మీ అండ చూసి మీ చోటా గ్యాంగ్ అంతా భూములను ఇష్టానుసారం గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్నారు . తీస్తాం ప్రతి ఇంచు కూడా బయటికి తెస్తాం. రాసిపెట్టుకోండి ..పలాస నియోజకవర్గంలో ప్రతి టిడిపి నాయకుడికి చెబుతున్న ప్రశాంతంగా ఉన్న నన్ను అలాగే ఉండనివ్వండి. పలాస లో అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి కి గడిచిన మూడేళ్లలో జరిగిన అభివృద్ధికి సవాలు విసురుతున్న…మీకు దమ్ముంటే చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు.