CM Chandrababu: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు క్రమ శిక్షణ గీత దాటుతున్న నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
సత్యవేడులో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన...? ఒక ఎమ్మెల్యేనే పక్కనపెట్టి మీరే పనులు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు.. ఒకరి కో-ఆర్డినేటర్, మరొకరు పరిశీలకుడు అంటారు.. ఎంతమంది పెత్తనం చెలాయిస్తారు సత్యవేడుపై అంటూ ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆందోల్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫోట్‌ను షేర్ చేసుకున్నారు.
Pawan Kalyan : గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకపోత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు శాఖలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అప్పచెప్పారు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ…
బీసీలు అధికంగా ఉండే ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను తెలుగుదేశం పార్టీ బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ ఐక్యవేదిక నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించారు. మాచాని సోమప్ప మెమోరియల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 30 కులాల బీసీ నాయకులు భారీ ఎత్తులో పాల్గొన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు.
నా చెల్లి నారా భువనేశ్వరి కూడా ఈ దీక్షలో కూర్చుంటారు అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రకు టీడీపీ తరపున మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. మా పార్టీ తరఫున ఐదు మందిని, జనసేన తరుఫున 5మందీతో కమిటీ వేస్తామని చెప్పారు.