Ap Ministers: టీడీపీ ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోవడం గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ కుదేలైపోయిందని, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవడం గ్యారంటీ అన్నారు ఏపీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. అచ్చెన్నాయుడు ఏ గాలి పార్టీలో ఉన్నాడు.. మాది గాలి పార్టీనో.. మంచి పార్టీనో.. మా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నామో..అచ్చెన్నాయుడుకి ఆయన గురువుకి బాగా తెలుసు. టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా కుదేలైపోయింది.. వాళ్ళేదైనా మాట్లాడుతారు..
రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తు కోసం స్ట్రెయిట్ లైన్ లో వెళ్తున్నాం. మా నాయకుడు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెర తీసిన సీఎం జగన్. అది చెప్పటానికే మంత్రుల బస్సు యాత్ర. రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి పరిపాలన బాగా చేశారో ప్రజలు చెప్పుకుంటారు. టీడీపీ మహానాడు గురించి ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు మంత్రి మేరుగ నాగార్జున.
Also Read
మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నిరంతరం ప్రజల్లో ఉండే పార్టీ. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. ఎవరో ఏదో పార్టీ కార్యక్రమాలు పెట్టుకుంటే మాకేంటి.. మా పని మేము చేసుకుంటూ పోతాం. ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం. 75 ఏళ్లలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం. సామాజిక న్యాయాన్ని టీడీపీ మాటలకే పరిమితం చేసిందన్నారు. బీసీలు, ఎస్సీలకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో అందరూ చూసారు. ప్రాణవాయువు అయిన గాలిని విమర్శిస్తే వాళ్ళే మా ఫ్యాను గాలికి కొట్టుకు పోతారన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!