తిరువూరు... పంచాయతీ.. నివేదిక సీఎం చంద్రబాబు కు చేరింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీస్కుంటామన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ క్రమ శిక్షణా సంఘంతో చంద్రబాబు భేటి అయ్యారు.
Cyber Fraud: AI టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లు చెప్పి డబ్బులు వసూల్ చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత నుంచి 50 వేల రూపాయలను భార్గవ్ వసూలు చేశాడు.
JC Prabhakar Reddy Threats: ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన నువ్వు ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు.. ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలని జేసీ నన్ను బెదిరించాడు.
Annadata Sukhibhava: కడప మహానాడులో హామీ ఇచ్చా త్వరలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనుకున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రారంభించాం. 2028 డిసెంబర్ కల్లా ఫేస్ వన్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు..
జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదల సేవలో తాను ఉండాలని సింగపూర్ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చినట్టు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 64 లక్షల మందికి 33 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదలకు ఇస్తున్నామని చెప్పారు.
రాజకీయాలు పూర్తి కలుషితం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం మీడియాతో మాట్లాడారు. నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్న ఈ నేరస్థులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికల ముందు మోసపోయానని.. ఎప్పుడూ నేను నేరం చేశానా.. హత్య రాజకీయాలు చేశానా..? అని ప్రశ్నించారు.
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా…