TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Politburo Meeting: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌బ్యూరో సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌తో పాటు పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశం పాల్గొననున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ముఖ్య రాజకీయ అంశాలు, అలాగే మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరులో వర్చువల్ విధానంలో నిర్వహించనున్న మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళిక, ఆమోదించాల్సిన తీర్మానాలు, విడుదల చేయనున్న ప్రకటనలు వంటి అంశాలు ప్రధాన అజెండాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలపై కూడా పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!