Off The Record: బోండా ఉమా వ్యాఖ్యల రగడ వెనుక కథ ఇదే!
- బోండా ఉమా స్వపక్షంలో విపక్షంగా మారుతున్నారా?.. హైకమాండ్‌కు వీర విధేయుడినని అంటూనే కొత్త సమస్యలు.. కులం పేరుతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పి.. కాపుల్లో అలజడి ఉందన్న వ్యాఖ్యలతో రాజకీయ కాక.. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు ఆదేశాలు.. మంత్రి పదవి దక్కలేదన్న ఫ్రస్ట్రేషన్ ఉందా?.. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులని ఇటీవల కామెంట్.. ఈసారి టీడీపీ టిక్కెట్ రాకున్నా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారా?..
- బోండా ఉమా డిసైడైనట్టే కనిపిస్తోందన్న అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే స్వపక్షంలో విపక్షంలా మారుతున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలపడుతోంది. తన అసమ్మతిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉన్నారాయన. అయితే… ఎక్కడా తేడా రాకుండా… తాను హైకమాండ్‌కు వీర విధేయుడినని చెప్పుకుంటూనే… ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తెచ్చి పెట్టడం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. గతంలో అధికారులతో విభేదాలుండేవి. ఆ మధ్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌నే టార్గెట్ చేశారాయన. ఇప్పుడైతే ఏకంగా సామాజిక వర్గం పేరుతో అధినాయకత్వానికి తల నొప్పి తెచ్చి పెట్టారు. పార్టీ ఎవరినైతే వద్దని భావించిందో.. వారినే ప్రశంసిస్తున్నారు బోండా. దీంతో… ఆయన ఎందుకిలా చేస్తున్నారు? భవిష్యత్ లెక్కలు మారుతున్నాయా…? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి టీడీపీ కాపు నేతల్లో మంచి వాయిస్ ఉన్న లీడర్ ఉమా మహేశ్వరరావు.
కానీ… ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి మద్దతుగా మాట్లాడుతూనే..వివాదం సృష్టించారనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలంగా ఉందట. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే… ప్రస్తుతం రాష్ట్రంలోని కాపుల్లో అలజడి ఉందన్నారు. టీడీపీ….2019లో ఓడి పోవడానికి ముద్రగడ పద్మనాభం ప్రధాన కారణం అని చెప్పారు. దీంతో… టీడీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. దాని గురించి పార్టీలో తీవ్ర స్థాయి చర్చ జరగడమే కాకుండా…. వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవద్దంటూ..సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యేదాకా వెళ్లింది వ్యవహారం. అసలు మొదట్నుంచి బోండా రూటే సపరేటు అన్నది పార్టీ వాయిస్. ఆయన అసెంబ్లీలో అయినా.. బయట అయినా ఒకే తీరున వ్యవహరిస్తారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో బోండా మంత్రి పదవి ఆశల ప్రస్తావన కూడా వస్తోంది. ఈసారి తనకు గ్యారంటీగా కేబినెట్ బెర్త్ దక్కుతుందని ఆశించారాయన. కానీ… తనకు ఇవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళకు ఇచ్చారంటూ ఆ మధ్య బహిరంగం గానే కామెంట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వైసీపీలో మంత్రిగా చేసిన వ్యక్తే తిరిగి కూటమి ప్రభుత్వంలో కూడా మినిస్టర్ అవడం ఉమాకు నచ్చలేదని, అందుకే మొదట్నుంచి ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Also Read
ఈ పరిస్థితుల్లో… కాపు సామాజిక వర్గం ప్రస్తావన తీసుకురావడం కాక రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో అలజడి ఉందని అంటూ…. ఆయన తనలో ఉన్న అసంతృప్తిని బయట పెట్టినట్టు కనిపిస్తోందంటున్నారు కొందరు. మరోవైపు గతంలో పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని…. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే.. ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారని, ఆయన ఆఫీసు నుంచి మాకు ఆదేశాలు రావాలని చెబుతున్నారంటూ ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారాయన. ఇక తాజాగా ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలతో వివాదం పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా కాపుల్లో అలజడి వ్యాఖ్యలు పార్టీ నాయకత్వానికి అస్సలు నచ్చలేదట. సొంత పార్టీ లోనే… ఒక సీనియర్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి ఉందంటూ… బహిరంగంగా మాట్లాడ్డం టీడీపీ నాయకత్వానికి రుచించటం లేదని టాక్.
ఇలాగే చూస్తూ ఊరుకుంటే…. ఇది మరింతగా ముదిరే ప్రమాదం ఉందని అధిష్టానం భావించినట్టు సమాచారం. అలాగే… వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకుంటే..తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కూడా టీడీపీ భావిస్తోందట. అందుకోసనే తన వ్యాఖ్యల మీద బోండాను వివరణ కోరినట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే మరో చర్చ కూడా మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ రాకున్నా…. ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే తన రూట్ తాను సెట్ చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే తన మార్క్ రాజకీయం మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాను వైసీపీ వారితో కలిస్తే ఇబ్బంది అనుకుంటే….. ఇదే అంశానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ కలిసి పాల్గొన్నారని.. వారిని కూడా వివరణ కోరతారా అని ప్రశ్నిస్తున్నారాయన. దీంతో.. బోండా ఉమా పూర్తిగా డిసైడ్ అయినట్లే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ఏం చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!