CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Warning: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సాయికృష్ణ ఘటనకు కూడా కులం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి విమర్శలకు తగిన సమాధానం చెప్పే శక్తి తమకు ఉందని పేర్కొన్నారు. ఇక, గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని ఆరోపించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపచారం చేశారని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ప్రజలు, భక్తులు ఎప్పటికీ క్షమించరని అన్నారు.
స్వామివారికి అపచారం జరిగితే బాధ్యులను శిక్షించాలా లేదా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఇప్పుడు అదే వ్యక్తులు దేవాలయాల చుట్టూ తిరుగుతూ భక్తి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దేవుడిని నిజంగా విశ్వసించే ఏ వ్యక్తి కూడా అలాంటి చర్యలను సమర్థించరని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షంగా ఉన్న ‘గొడ్డలి పార్టీ’ రాష్ట్రంలో విషపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. నేరాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సమర్థులని విమర్శించారు. మెగా డీఎస్సీ పూర్తయి ఏడాది గడిచిన తర్వాత పేపర్ లీక్ జరిగిందని ఆరోపించడం విచిత్రమని చంద్రబాబు అన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరినా ప్రతిపక్ష నేతలు స్పందించలేదని తెలిపారు. అలాగే ఉద్యోగుల సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల హామీల్లో లేకపోయినా దాదాపు 11 వేల మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి తీసుకువచ్చి వారి జీవితాల్లో భరోసా కల్పించామని వెల్లడించారు సీఎం చంద్రబాబు..
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?