AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ స్థానాలు..
- ఎన్డీఏ భేటీలో కుదిరిన ఒప్పందం..
- కూటమి పార్టీల ఉమ్మడి కార్యాచరణ..
- రెండేళ్ల కూటమి పాలన పై కార్యక్రమాలు..
- ఈ నెల 9న. తిరుపతి లో సంక్షేమంపై కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP NDA: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాజ్యసభ స్థానాల పంపకం దాదాపు ఖరారైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రానికి కేటాయించిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒక స్థానం జనసేనకు దక్కనున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో జరిగిన కూటమి పార్టీల సమావేశం అనంతరం మాట్లాడిన పల్లా శ్రీనివాస్, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను వివరించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 9వ తేదీన తిరుపతిలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 13, 16, 17, 18, 19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వివరించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ (SIR) ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు పల్లా శ్రీనివాస్..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, జనసేన పార్టీ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారని వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 12న అమరావతిలో జరిగే సభలో సుపరిపాలన ఫలితాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రాజ్యసభ స్థానాల పంపకం, రెండేళ్ల కూటమి పాలన ప్రచారం, మోడీ ప్రభుత్వ 12 ఏళ్ల విజయోత్సవాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!