జులై ప్రారంభం నుంచి జనంలోకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఈ విషయంలో ఇప్పటికే వారికి అధినేత నుంచి ఆదేశాలు అందాయి. అయితే... టీడీపీ నేతలను ఓ డౌట్ బాగా వేధిస్తోందట. అధినేత ఆదేశించినట్టుగానే జనంలోకి వెళ్తాం సరే. వెళ్లి ఏం జనానికి ఏం చెప్పాలి..? సూపర్ సిక్స్‌లో పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఎలా కన్విన్స్ చేయాలి..? అని లోలోపల మధనపడిపోతున్నారట.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. సుపరిపాలనకు సంవత్సరం పేరిట వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇదే... ఫస్ట్ ఇయర్లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎవరి ప్లస్‌లు ఏంటి? ఎవరి మైనస్‌లు ఏంటి? ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు, ఇరుక్కుంటున్నారంటూ.... డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో... ఈ టైంలో మనోళ్ళు ఏం చేశారు? నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఘనకార్యాలు వెలగబెడుతున్నదెవరంటూ... ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. కేవలం రిపోర్ట్‌లు తీసుకోవడానికే పరిమితం అవకుండా... కాస్త తేడాగా అనిపించిన ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారట ఆయన.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరిగాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా... ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు లేదు. అదే సమయంలో... కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్ళి.... వాళ్ళు లేకపోతేనేం.... మేమున్నాంగా.... అంటూ, ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు. ధూళిపాళ్ళ నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్న ఆయన.. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని స్పష్టం చేశారు..
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో హీట్ పుట్టిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలను తలపించేలా నడుస్తోంది వ్యవహారం. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. అలాగే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న.. పిడిఎఫ్‌తోపాటు ఇతర ఉద్యోగ సంఘాలుకూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి.. సవాల్ విసురుతున్నారు.
ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.
ఈ రోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోన్న ఆయన.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు కూడా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది..
రేపటి(శుక్రవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.