ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు. కానీ...ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచినా... జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో...డీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్.
Visakhapatnam: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒక ఎత్తైతే.. ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే…
టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వన్ టు వన్ మీటింగ్స్‌తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా నలుగురైదుగురు శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు.
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాలు విమర్శలు వస్తున్నాయి.. కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాలలో ఇరుక్కుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.. సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు.
కొంతమంది మంత్రులు.. ఎమ్మెల్యేల పనితీరు పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు..క్యాబినెట్ సమావేశంలో క్లాస్.తీసుకున్నారు... ఎమ్మెల్యేల పనితీరు మరకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు... ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులు. అధికారులు... వెంటనే దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.
కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు మంత్రి నారా లోకేష్.. మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదస్పద ఘటనలపై మంత్రులతో చర్చించారు.. ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలను ప్రస్తావించారట.. మరోవైపు, రౌడీషీటర్ శ్రీకాంత్‍కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట.. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదని హితవు చెప్పారట లోకేష్.. టీడీపీ అధినేత,…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మరీ... అందుకు సంబంధించిన దిశా నిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల రెండు నుంచి మొదలైన కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెల రోజుల పాటు సిన్సియర్‌గా నిర్వహించాలన్న ఆదేశాలున్నాయి పార్టీ పెద్దల నుంచి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిపోయింది. కానీ... అంతకు చాలా రోజుల ముందు నుంచే... తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద దృష్టి పెట్టారట సీఎం చంద్రబాబు. శాసనసభ్యుల ప్రతి మూవ్‌మెంట్‌కు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.